AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

చరిత్రలో ఎప్పుడూ జరక్కపోవచ్చేమో...! అప్పుడే నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి...! మే నెలలోనే ఎండాకాలాన్ని పంపించేశాయి. వర్షాకాలాన్ని అధికారికంగా ప్రకటించేలా చేశాయి. ఈసారి అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆ వివరాలు..

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
Ap Rains

Updated on: May 27, 2025 | 7:30 PM

రుతుపవనాల ఉత్తర పరిమితి 17.0°ఉత్తర అక్షాంశం /55°తూర్పురేఖాంశం, 17.5°ఉత్తర అక్షాంశం/60°తూర్పురేఖాంశం, 18°ఉత్తర అక్షాంశం/65°తూర్పురేఖాంశం,18.5°ఉత్తర అక్షాంశం/70°తూర్పురేఖాంశం, ముంబై, పూణే, షోలాపూర్, కలబురగి, మహబూబ్‌నగర్, కావలి, 16.5°ఉత్తర అక్షాంశం/83°తూర్పురేఖాంశం, 19°ఉత్తర అక్షాంశం/86°తూర్పురేఖాంశం,21°ఉత్తర అక్షాంశం/89°E, అగర్తల, గోల్‌పారా 28.5°ఉత్తర అక్షాంశం /89°తూర్పురేఖాంశం గుండా వెళుతుంది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్యసుమారుగాలోని చాలా ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు రాబోయే 2-3 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

వాయువ్య దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 0830 గంటలకు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఇది నెమ్మదిగా ఉత్తరం వైపుకు కదిలే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో మరింత గా బలపడే అవకాశముంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు విదర్భపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. భారత ప్రాంతం మీదుగా గాలుల కోత సుమారుగా 17°ఉత్తర అక్షాంశం వెంబడి ,సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణం దిశగా వంగి ఉంటుంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు :-
—————————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-
——————-

ఈరోజు:-
—————————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఆనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఆనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50 -60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.