Lorry Theft: మరీ ఇలా ఉన్నారేంట్రా..! డ్రైవర్ నిద్రపోతుండగా షాకింగ్ సీన్.. క్షణాల్లోనే లారీ మాయం..

చెన్నై నుండి బయలు దేరిన లారీ జాతీయ రహదారిపై జోరుగా సాగిపోతుంది. అద్దంకి వద్ద నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు అద్దంకి -నార్కట్ పల్లి హైవే పైకి వచ్ఛింది‌. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్దకు చేరుకున్న కొద్దీ సేపు విశ్రాంతి తీసుకునేందుకు డ్రైవర్, క్లీనర్ లారిని రోడ్డు ప్రక్కన..

Lorry Theft: మరీ ఇలా ఉన్నారేంట్రా..! డ్రైవర్ నిద్రపోతుండగా షాకింగ్ సీన్.. క్షణాల్లోనే లారీ మాయం..
Lorry Theft
Follow us

|

Updated on: May 26, 2022 | 1:54 PM

టీవీల లోడుతో వెళుతున్న ఓ లారీని కేటుగాళ్లు ఇట్టే మాయం చేశారు. చెన్నై నుండి బయలు దేరిన లారీ జాతీయ రహదారిపై జోరుగా సాగిపోతుంది. అద్దంకి వద్ద నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు అద్దంకి -నార్కట్ పల్లి హైవే పైకి వచ్ఛింది‌. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్దకు చేరుకున్న కొద్దీ సేపు విశ్రాంతి తీసుకునేందుకు డ్రైవర్, క్లీనర్ లారిని రోడ్డు ప్రక్కన నిలిపివేశారు. లారీ కంటైనర్ ను రోడ్డు పక్కన నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిద్దరిపై దాడి చేసి లారీ కంటైనర్ ను అపహరించుకుపోయారు‌. దాడి నుంచి కోలుకున్న డ్రైవర్, క్లీనర్ రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కంటైనర్ కోసం వెదుకులాట ప్రారంభించారు. పిడుగురాళ్ళ మండలం సమీపంలో కంటైనర్ రోడ్డు పక్కన ఉన్నట్లు రొంపిచర్ల పోలీసులకు సమాచారం వచ్చింది. హూటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు కంటైనర్ ను రొంపిచర్ల స్టేషన్ కు తరలించారు. అక్కడ కంటైనర్ డ్రైవర్, క్లీనర్ సాయంతో ఓపెన్ చేయించి చూడగా అన్ని టివిలు ఉన్నట్లు వారు తెలిపారు‌. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై నుండి హైదరాబాద్ కు కోటి రూపాయల విలువైన టివిల లోడుతో బయలు దేరిన కంటైనర్ ను దొంగలు ఫాలో అయ్యారు‌.

రొంపిచర్ల వద్ద కంటైనర్ ను అపహరించి టివిలు తీసుకెళ్ళేందుకు ప్లాన్ వేశారు. అయితే అది వర్కవుట్ అవ్వకపోవటంతో కంటైనర్ ను పిడుగురాళ్ల సమీపంలో వదిలేసి వెళ్ళినట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్య ప్రదేశ్ కు చెందిన దొంగలే లారీని అపహరించుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఈ ముఠాలే చెన్నై నుండి వచ్చే సెల్ ఫోన్ లోడ్ తో ఉన్న లారీలను అపహరించి సెల్ ఫోన్ లను దోచుకెళ్ళేవారు. అయితే గత కొంతకాలంగా పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంతో వారి ఆగడాలు తగ్గాయి. కొంతకాలం పాటు ఈ ముఠాలు కూడా గ్యాప్ తీసుకొని తిరిగి దొంగతనాలు ప్రారంభించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.