Andhra Pradesh: సేద తీరేందుకు చెట్టు కిందకు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెన్నులో వణుకు

|

Mar 13, 2022 | 5:38 PM

అనంతపురంలో అస్తిపంజరాలు కలకలం రేపాయి. కెనాల్‌లో కొట్టుకొచ్చిన రెండు అస్థిపంజరాలను చూసి వణికిపోతున్నారు స్థానికులు.

Andhra Pradesh: సేద తీరేందుకు చెట్టు కిందకు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెన్నులో వణుకు
Skeletons Mystery
Follow us on

Anantapur District: అనంతపురం జిల్లాలో అస్థిపంజరాలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ మండలం మోపిడి దగ్గర హెచ్‌ఎల్‌సీ కాలువలో వరద ప్రవాహానికి రెండు అస్థిపంజరాలు కొట్టుకొచ్చాయి. నీటి ప్రవాహం ఆగిపోవడంతో అక్కడే చెట్లకు చిక్కుకుని ఆగిపోయాయి. అస్థిపంజరాలను చూసి భయాందోళనలకు గురైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని స్కెల్టన్లను పరిశీలించారు పోలీసులు. అస్థిపంజరాలు ఓ పురుషుడు, మహిళకు చెందినవిగా గుర్తించారు. అవి దొరికిన చోటనే వైద్యులను పిలిపించి పోస్టుమార్టం చేయించారు. అస్థిపంజరాలను పరిశీలించిన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిరోజుల క్రితం మృతి చెంది ఉంటారు? వీరివి సహజమరణాలా లేక హత్య చేసి కెనాల్‌లో పడేసి ఉంటారా అన్న కోణంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అస్థిపంజరాల లభ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. స్కెల్టన్స్‌ ఎవరివై ఉంటాయి? ఎక్కడి నుంచి కొట్టుకువచ్చి ఉంటాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఈ కేసులో ముందుకు పోలేమని స్పష్టం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన అంశాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేస్తామని చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేని ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టే కీలకమంటున్నారు పోలీసులు. మృతుల వయస్సు కూడా రిపోర్టు ఆధారంగానే గుర్తించగలుతామని వెల్లడిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral: బాత్రూం యూజ్ చేసేందుకు తలుపు తీశాడు.. లోపల దృశ్యం చూసి పరుగో పరుగు

Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..