Achhenna on Liquor: మద్యపాన నిషేధం అసాధ్యం.. పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తాంః అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం అసాధ్యం అంటున్నారు ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాము అధికారంలోకి వస్తే పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తామంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం ఎవరి వల్లా కాదంటున్నారు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తే....చంద్రబాబు హయాంలో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ తిరిగి తీసుకొస్తామని, మద్యం ధ‌ర‌లు నియంత్రిస్తామని చెబుతున్నారు అచ్చెన్న.

Achhenna on Liquor: మద్యపాన నిషేధం అసాధ్యం.. పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తాంః అచ్చెన్నాయుడు
Achhennayudu
Follow us

|

Updated on: Nov 19, 2023 | 8:11 AM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం అసాధ్యం అంటున్నారు ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాము అధికారంలోకి వస్తే పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తామంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం ఎవరి వల్లా కాదంటున్నారు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తే….చంద్రబాబు హయాంలో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ తిరిగి తీసుకొస్తామని, మద్యం ధ‌ర‌లు నియంత్రిస్తామని చెబుతున్నారు అచ్చెన్న.

మద్యం వ్యాపారంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని అచ్చెన్న ఆరోపించారు. మ‌ద్యం తాగేవారి ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారన్నారు అచ్చెన్న. గత నాలుగున్నరేళ్లలో నాసిరకం మద్యం తాగి 35 వేల మంది చనిపోయారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు హయాంలో మద్యంపై ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే వైసీపీ హయాంలో లక్షా పది వేల కోట్లు వచ్చిందన్నారు. మద్యం ధరలు పెంచేశారని, 60 రూపాయల క్వార్టర్‌ బాటిల్‌ను 200 చేశారంటూ విమర్శలు గుప్పించారు అచ్చెన్న.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది. క్వార్టర్ సీసాపై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గుదల కనిపించింది. వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల వాటి ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.

ప్రస్తుతం వ్యాట్‌ వసూళ్లలో మార్పులు తీసుకురావడం వల్ల తరచూ విక్రయించే బ్రాండ్లపై కొంత భారం పడింది. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10-40 వరకూ, హాఫ్ బాటిల్‌పై రూ. 10-50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ. 10-90 వరకూ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మద్యం బాటిళ్లపై ఉన్న ఐఎంఎఫ్ఎల్ ఆధారంగా పన్నుల శాతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150శాతం పన్నులు విధించినట్లు తెలిపారు. ఇక బీరుపై 225%, వైన్‌పై 200%, విదేశీ మద్యంపై 75% ఎఆర్ఈటీ ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ బ్రాండ్ల పై ఉన్న ధరలను చాలా కాలంగా పెంచలేదని, వాటి రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా ప్రస్తుతం పెంచామని వివరించారు.

మద్యపాన నిషేధం అసాధ్యం అనడమే కాకుండా పాత బ్రాండ్లు తిరిగి తెస్తామని అచ్చెన్న చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇవి పొలిటికల్‌గా ఎలా టర్న్‌ తీసుకుంటాయో వేచి చూడాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023