AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఆ ప్రాంతాల్లో జోరు వానలు.. వెదర్ రిపోర్ట్

|

Jan 14, 2025 | 3:46 PM

ఏపీలో పండుగ వేళ వర్షాలు దంచి కొట్టనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.? వాతావరణ అధికారులు ఇచ్చిన సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఆ ప్రాంతాల్లో జోరు వానలు.. వెదర్ రిపోర్ట్
Ap Weather
Follow us on

కన్యాకుమారి సమీపంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా..
—————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:-
————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి