Tirumala: వామ్మో.. చిరుతపులొచ్చింది.. తిరుమల కొండపై టెన్షన్.. టెన్షన్..

|

Mar 26, 2023 | 8:59 AM

తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహనదారుల కంటపడింది.

Tirumala: వామ్మో.. చిరుతపులొచ్చింది.. తిరుమల కొండపై టెన్షన్.. టెన్షన్..
Leopard
Follow us on

తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహనదారుల కంటపడింది. శేషాచలం కొండల నడుమ చిన్నపాటి కొలను వద్ద చిరుత పులి సేద తీరుతూ.. నక్కి నక్కి చూస్తున్న దృశ్యాలు అందర్నీ భయాందోళనకు గురి చేశాయి. దీంతో తిరుపతికి వెళ్తున్న వాహనదారులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు.. మెుదట చిరుతను చూసిన భక్తులు భయపడిన.. తర్వాత తెరుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గత కొంతకాలంగా తిరుమలకు వెళ్లే భక్తులకు చిరుత పులుల భయం పట్టుకుంటోంది. కరోనా సమయం నుంచి అటవీ ప్రాంతంలోని జంతువులు.. తిరుమల కొండపైన ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు చిరుత పులులు భక్తుల కంటపడగా.. అయితే తాజాగా మరోసారి చిరుత సంచారం కలకలం రేగింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు ప్రయాణికులకు, శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.