Andhra Pradesh: అలిపిరి నడక మార్గంలో మళ్లీ భయం భయం.. చిరుత, ఎలుగుబంటి సంచారం..

| Edited By: Jyothi Gadda

Dec 30, 2023 | 4:15 PM

చిరుతల సంచారం పై నిరంతర నిఘా కొనసాగిస్తున్న అటవీశాఖ అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం లో ప్రస్తుతం 300కు పైగానే ట్రాప్ కెమెరాలు, దాదాపు 100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచింది. చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నడకమార్గానికి దగ్గరగా రాకుండా చర్యలు చేపట్టింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైంటిస్ట్ టీం అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాలలో పర్యటించి చిరుతల సంచారం వల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్వే నిర్వహించింది.

Andhra Pradesh: అలిపిరి నడక మార్గంలో మళ్లీ భయం భయం.. చిరుత, ఎలుగుబంటి సంచారం..
Leopard
Follow us on

ఆంధ్రప్రదేశ్, డిసెంబర్30; తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతోంది. 6 నెలలుగా ఏడుకొండలు ఎక్కాలంటేనే భక్తులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. 6 నెలల క్రితం కౌశిక్ పై చిరుత దాడి, ఆగస్టులో లక్షిత ను చంపిన చిరుత ఇలా వరుస ఘటనలతో బెంబేలుతున్న భక్తులు ఇప్పుడు తిరిగి నడక మార్గం లో సంచరిస్తుండడం గుబులు రేపుతోంది. చిరుతల భయం లేకుండా టీటీడీ భరోసా ఇస్తుందా, వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలతో అటవీశాఖ చర్యలు తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది.

తిరుమల నడకమర్గాల్లో చిరుతల భయం భక్తలను ఇప్పట్లో వీడేలా లేదు. చిరుతల సంచారం తగ్గిందంటున్న టిటిడి నడక మార్గాల్లో ఆంక్షలను కూడా సడలించిన టిటిడి ఇప్పుడు తిరిగి నడక మార్గానికి దగ్గర్లోనే సంచరిస్తున్న చిరుతలు ఎరుగుబంట్ల నుంచి భయాన్ని పోగొట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక తల పట్టుకుంటుంది. ఇప్పటికే ఇక మార్గాల్లో భక్తులకు కర్రలు ఇస్తున్న టీటీడీ గుంపులు గుంపులుగానే తిరుమల యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకుంది. మరోవైపు ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలని కూడా భావిస్తున్న తరుణంలో ఈ నెల 26 నుంచి వరుసగా చిరుత, ఎలుగుబంటి సంచరిస్తుండడం అటవీ శాఖలో ఆందోళన కలిగిస్తుంది. మొదటి ఘాట్ రోడ్ లోని ఎలిఫెంట్ ఆర్చ్ సమీపంలోనే చిరుత, ఎలుగుబంటి సంచారం అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఇమేజెస్ క్యాప్చర్ అయ్యాయి.

నరసింహస్వామి ఆలయం సమీపంలోనే చిరుత సంచారం కొనసాగినట్లు అటవీ శాఖ కూడా భావిస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ నడక మార్గానికి దగ్గరగా వస్తే బంధించేందుకు ప్రయత్నిస్తోంది. కౌశిక్, లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుతల సంచారం కొనసాగుతున్నట్లు గుర్తించిన అటవీశాఖ ఆ ప్రాంతమంతా చిరుతల ఆవాసంగానే భావిస్తుంది. ప్రే బేస్డ్ ఏరియా గా గుర్తించిన ప్రాంతంలో చిరుతల కదలికలు ఉన్న విషయాన్ని వాస్తవమేనన్న అభిప్రాయంతో ఉన్న అటవీ శాఖ అప్రమత్తంగానే ఉంది. టీటీడీ సహకారంతో నడక మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం తలపెట్టకుండా చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంది. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించిన అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తుంది. కావలసిన అంత సిబ్బంది తో అలిపిరి నడక మార్గంలోని ఏడవ మైలు, నరసింహ స్వామి ఆలయం ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేసింది. వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా అనుమతిస్తేనే కంచె నిర్మాణం చేపట్టాలా లేక ఇతర చర్యలతో చిరుతల భయం లేకుండా చేయాలా అని ఆలోచిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ తిరుమల కొండెక్కే భక్తులకు రెండ్రోజుల క్రితం గుర్తించిన చిరుత ఎలుగుబంటి సంచారం భక్తుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇప్పటికీ తిరుమల కొండెక్కే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని నడక మార్గంలో తిరుమల యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి ఉండగా ఇప్పుడు తిరిగి కదలిక కంగారు పెట్టిస్తుంది. చిరుతల సంచారం పై నిరంతర నిఘా కొనసాగిస్తున్న అటవీశాఖ అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం లో ప్రస్తుతం 300కు పైగానే ట్రాప్ కెమెరాలు, దాదాపు 100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచింది. చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నడకమార్గానికి దగ్గరగా రాకుండా చర్యలు చేపట్టింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైంటిస్ట్ టీం అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాలలో పర్యటించి చిరుతల సంచారం వల్ల భక్తులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సర్వే నిర్వహించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ టీం శేషాచలం అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు నడక మార్గాలు, ఘాట్ రోడ్లను దాటే సమయంలో ఇబ్బంది పడకుండా తీసుకోవలసిన చర్యలు చేపట్టాల్సిన నిర్మాణాలపై కూడా ఆరా తీసి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైంటిస్ట్ టీం ఇచ్చిన నివేదికలో ఏముంది..

అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో కంచె నిర్మాణం చేపట్ట నుందా లేక ఎలివేటెడ్ వాక్ వే ల నిర్మాణం అవసరమా అన్నదానిపై ఇంకా ఇలాంటి నిర్ణయము తీసుకోలేదు. స్కై వేస్ లాంటి ఓవర్ పాస్ లు, అండర్ పాస్ లపై కూడా చర్చ జరిగినా ఏ ఏ ప్రాంతాల్లో నిర్మించాలన్న దానిపై కూడా ఎక్స్పర్ట్స్ టీం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగానే టీటీడీ కూడా తిరుమల నరకమార్గాల్లో శాశ్వత ప్రాతిపదికన చిరుతల దాడులకు పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. అయితే తరచూ నడక మార్గాల్లో సంచారిస్తూ అతిధుల్లా భక్తులకు కనిపిస్తున్న చిరుతలు ఎలుగుబంట్లు వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..