Tirupati: పులుసు పెట్టే ఆశ కూడా లేదు.. ఆకు కూర కట్ట 40 రూపాయలు

|

Dec 27, 2021 | 9:39 AM

పెట్రోల్ వంద దాటింది.. దాని వెన్నంటే డీజిల్ కూడా పరుగులు పెడుతోంది. గ్యాస్.. గుదిబండగా మారింది. తాజాగా ఆకుకూరలు హడలెత్తిస్తున్నాయి.

Tirupati: పులుసు పెట్టే ఆశ కూడా లేదు.. ఆకు కూర కట్ట 40 రూపాయలు
Leaf Vegetable
Follow us on

పెట్రోల్ వంద దాటింది.. దాని వెన్నంటే డీజిల్ కూడా పరుగులు పెడుతోంది. గ్యాస్.. గుదిబండగా మారింది. కూరగాయల ధరలు కూడా సామాన్యుడి మాడు పగలగొడుతున్నాయి. దీంతో ఆకుకూరలు కొని పులుపు పెట్టి.. రోజులు ముందుకు తీసుకెళ్తున్నారు పేద, సామాన్య వర్గాలు. అయితే ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. ఆకు కూర మామూలుగా అయితే ఎంత ఉంటుంది. 5 లేదంటే 10 రూపాయలు. ఒక్కోసారి 10 రూపాయలకే మూడు, కట్టలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని కూరగాయల ధరలు పెరిగినా కూడా ఆకుకూరలు పెరిగిన దాఖలాలు లేవు.

కానీ తిరుపతిలో తిరుపతిలో కూరగాయలు, ఆకుకూరలు ధరలు కొండెక్కాయి. ఆకు కూర కట్ట ఏకంగా 40 రూపాయలకు చేరింది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో.. సామాన్యులు తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు ఆకుకూరలు కూడా రేట్లు పెరిగిపోయాయి. దీంతో లబోదిబోమంటున్నారు వినియోగదారులు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆకుకూరల పంటలు దెబ్బతినడం, దిగుబడి లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటాయని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

Also Read: చిరకట్టులో చామంతి.. ఓణీలో పూబంతి..’పదహారణాల తెలుగమ్మాయి’ ఈ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ ఏడాది ట్రాఫిక్‌ చలనాల రూపంలో సర్కారీ ఖజానాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మతి పోతుంది..