తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న ఇరువురు నేతలు..

| Edited By: Srikar T

Jun 12, 2024 | 1:33 PM

ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్యాబినెట్‎లో స్థానం దక్కింది. బిసి, తూర్పు కాపు సామాజికవర్గం నుండి కొండపల్లి శ్రీనివాసరావుకు అవకాశం రాగా, ఎస్టీ సామాజిక వర్గం నుండి గుమ్మిడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. జిల్లాలో పలువురు సీనియర్లు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారసులు ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టి వీరిద్దరికి మంత్రి పదవి దక్కటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన నేత.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న ఇరువురు నేతలు..
Telugudesam
Follow us on

ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్యాబినెట్‎లో స్థానం దక్కింది. బిసి, తూర్పు కాపు సామాజికవర్గం నుండి కొండపల్లి శ్రీనివాసరావుకు అవకాశం రాగా, ఎస్టీ సామాజిక వర్గం నుండి గుమ్మిడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. జిల్లాలో పలువురు సీనియర్లు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారసులు ఉన్నప్పటికీ వారిని పక్కనపెట్టి వీరిద్దరికి మంత్రి పదవి దక్కటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన నేత. కొండపల్లి శ్రీనివాసరావు తాతగారైన కొండపల్లి పైడితల్లి నాయుడు టిడిపిలో సుధీర్ఘంగా సేవలు అందించాడు. ఆయన మాజీ టిడిపి జిల్లా అధ్యక్షుడిగా, మాజీ జడ్పీ చైర్మన్‎గా, మాజీ ఎంపీగా పనిచేశారు. పార్టీకి కొండపల్లి పైడితల్లి నాయుడు సేవలు మరువలేనివి. ప్రస్తుతం ఆయన మనుమడు శ్రీనివాసరావు రాజకీయాల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ సైన్స్‎లో ఎమ్‎ఎస్ చేసిన శ్రీనివాసరావు తరువాత అమెరికా నుండి తిరిగి ఇండియాకు వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

శ్రీనివాసరావు ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన సందర్భం లేదు. కానీ ప్రస్తుతం 2024 లో జరిగిన ఎన్నికల్లో గజపతినగరం నుండి టిడిపి తరుపున పోటీచేసి బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య పై సుమారు 24 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అయితే చీపురుపల్లి నుండి పోటీచేసి మాజీమంత్రి బొత్సను ఓడించిన ఇదే తూర్పు కాపు సామాజిక వర్గంకి చెందిన కీమిడి కళా వెంకట్రావును సైతం ప్రక్కనపెట్టి కొండపల్లి శ్రీనివాసరావు వైపు మొగ్గుచూపింది టిడిపి అధిష్టానం. ఇక మంత్రి పదవి పొందిన మరో నేత గుమ్మిడి సంధ్యారాణి. సాలూరు మాజీ ఎమ్మెల్యే జన్ని ముత్యాలు కుమార్తె సంధ్యారాణి. 1994 నుండి అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపిగా పోటీ చేసి వరుస ఓటములు చవిచూశారు. అయితే 2015లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టిడిపి అధిష్టానం. అంతేకాకుండా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకొనే పోలిట్ బ్యూరోలో సైతం అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో డిప్యూటీ సిఎం రాజన్నదొర పై గెలుపొంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇలా కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఇద్దరు నేతలు కూడా ఇప్పటివరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నేరుగా మంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..