Andhra Pradesh: సాంకేతిక లోపమా.. ACB దాడుల భయమా.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

|

Apr 27, 2023 | 5:20 PM

సబ్‌రిజిస్ట్రార్‌ సర్వరు పనిచేయడంలేదనే నెపంతో ఉదయంనుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకే ఫుల్‌స్టాప్‌ పెట్టేయడం కలకలం రేపుతోంది. ఏపీలోని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో లంచగొండి అధికారులు ప్రజల నెత్తురు తాగుతున్నారు.

Andhra Pradesh: సాంకేతిక లోపమా.. ACB దాడుల భయమా.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
Markapuram Registrations
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో లంచావతారాలపై దండెత్తింది ఏసీబీ. అవినీతి అధికారుల భరతం పట్టేపనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ప్రజలను లంచాల కోసం జలగల్లాపీల్చేస్తోన్న ఎమ్మార్వో కార్యాలయాల్లో ఆకస్మిక దాడులు చేసింది ఏసీబీ. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలూ, తహసీల్దార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు కొనసాగుతున్నాయి. మార్కాపురంలో ఏసీబీ దాడులతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. సబ్‌రిజిస్ట్రార్‌ సర్వరు పనిచేయడంలేదనే నెపంతో ఉదయంనుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకే ఫుల్‌స్టాప్‌ పెట్టేయడం కలకలం రేపుతోంది. ఏపీలోని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో లంచగొండి అధికారులు ప్రజల నెత్తురు తాగుతున్నారు.

ఫైల్‌ కదలాలంటే డబ్బు.. ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే లంచం.. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే లంచం.. చివరకు చచ్చినోడిని ధృవీకరించాలన్నా లంచం అడిగే శవాలమీద పేలాలేరుకునే లంచగొండి అధికారుల దందా దడపుట్టిస్తోంది. దీనిపై ఏసీబీ కి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు హఠాత్తుగా ఏపీలోని సబ్ రిజిస్టర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి పలువురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.

ఒకటీ రెండూ కాదు.. రాష్ట్రంలో టోల్‌ఫ్రీ నంబర్‌కి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య అక్షరాలా 14,400. దీంతో ఏపీలో అవినీతి దందా ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోంది. అందుకే ఎమ్మార్వో కార్యాలయాల్లో లంచావతారాల భరతం పట్టేపనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. గుంటూరు, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం జిల్లాల్లో అవినీతి దందా దడపుట్టిస్తోంది. చెదపురుగుల్లా జనాన్ని తినేస్తోన్న అవినీతిపై ధ్వజమెత్తింది ఏసీబీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం