V. Hanumantha Rao: కర్నూలులో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. కారణమేంటంటే..

|

Feb 12, 2022 | 1:16 PM

ఏపీలోని కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు (Hanumantha Rao)  డిమాండ్ చేశారు.

V. Hanumantha Rao: కర్నూలులో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. కారణమేంటంటే..
Follow us on

ఏపీలోని కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు (Hanumantha Rao)  డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన శనివారం కర్నూలు (Kurnool)లో దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah)  ఇంటి దగ్గర దీక్షకు దిగారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్‌ కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న డిమాండ్లు బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్‌ సర్కారు ఉత్తర్వులు వెలువరించిన తర్వాత ఈ డిమాండ్ మరింత ఎక్కువైంది. ఈక్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు కూడా కాంగ్రెస్‌ జిల్లాకు దామోదరం సంజీయవ్య పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

జగన్‌ పునరాలోచించాలి!

‘కడప జిల్లాకు వైఎస్సార్‌, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ , మన్యం ప్రాంతాలకు అల్లూరి పేర్లు పెట్టిన జగన్ ప్రభుత్వం కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమైన విషయం. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఎన్నో సేవలు అందించారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై పునరాలోచించాలి. అలాగే స్థానిక నేతలు కూడా ఈ విషయంపై జగన్‌పై ఒత్తిడి తీసుకురావాలి’ అని కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు వీహెచ్‌.  కాగా ఇదే డిమాండ్ తో దామోదరం  సంజీవయ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో హనుమంతరావు పాల్గొన్నారు.  కాగా కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న డిమాండ్‌ను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మొదటిసారిగా తెరమీదకు తీసుకొచ్చారు.

ఆ జిల్లాకు జాషువా పేరు పెట్టాల్సిందే..

కాగా గుంటూరులోని పల్నాడుకు గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతూ గుంటూరులో ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లక్ష్మణరావు, మధ్యవిమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్షణరెడ్డి, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.