Andhra Pradesh: ఒళ్లు గగుర్పొడిచే వీడియో… ఈ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో చూడండి…

|

Mar 03, 2022 | 6:41 PM

Andhra News: ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి మన ఏపీలో చోటు చేసుకుంది. 

Andhra Pradesh: ఒళ్లు గగుర్పొడిచే వీడియో... ఈ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో చూడండి...
Ap Accident
Follow us on

Viral Video: యాక్సిడెంట్‌(Accident)కి సంబంధించిన వీడియోలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొన్ని వీడియోలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి మన ఏపీలో చోటు చేసుకుంది.  కర్నూల్ జిల్లా(Kurnool District) ఆదోని… ఎమ్మిగనూరు రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. అయితే, ఆ బస్సు వేగానికి అతడు దూరంగా ఎగిరి పక్కకు పడ్డాడు. దీంతో టైర్లు అతడి మీదకు ఎక్కకుండా.. ముందుకు వెళ్లాయి. అంతటి ప్రమాదం జరిగినప్పటికీ బాటసారికి ఏమీ కాలేదు. అతడు చిన్న గాయం కూడా కాకుండానే బయటపడ్డాడు. రెప్పపాటు వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు’, ‘భూమ్మీద నూకలు ఉండి బతికిపోయాడు’…. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Also Read: AP: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

Telangana: కానిస్టేబుల్ గారూ..! మీరే ఇలా చేస్తే ఎలా..? ఇప్పుడు తలదించుకుంటే సరిపోద్దా..?