Heavy rains : కడప, కర్నూలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లే వాగులుగా మారిన వైనం

కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లే వాగులుగా మారాయి...

Heavy rains : కడప, కర్నూలు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లే వాగులుగా మారిన వైనం
Heavy Rains In Kurnool And

Updated on: Jul 05, 2021 | 4:48 PM

Heavy rains : కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లే వాగులుగా మారాయి. కుండపోత వర్షానికి స్థానికులు తీవ్రఇబ్బందులు పడ్డారు.. కడప పట్టణం, చింతకొమ్మదిన్నె ప్రాంతాల్లో ఇవాళ అతి భారీవర్షం నమోదైంది. నగరంలోని శివానందపురం, మృత్యుంజయకుంట, ఎన్జీవో కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఆర్టీసీ గ్యారేజ్ సముద్రాన్ని తలపించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు.

అటు, కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలే పడ్డాయి. ప్యాలకుర్తిలో కురిసిన వర్షానికి రోడ్లు పొలాలు, నదులను తలపించాయి. ప్యాలకుర్తి గూడూరు మధ్య రోడ్డుపై వర్షపు నీరు పొంగి ప్రవహించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. అలంపూర్‌కు వచ్చే రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో ప్రయాణికుతు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీల్లో పలు వార్డులు నీటిలో మునిగిపోయాయి.. వర్షాకాలం నేపథ్యాన రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Rains

Read also : JC comment : జేసీ కొత్త యాంగిల్ : వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని దారుణంగా తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?