Family Suicide: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు నగరానికి చెందిన ఓ కుటుంబ ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగి నలుగురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. మృతుల్లో దంపతులు ప్రతాప్, హేమలత ఉండగా, వారి కుమారుడు జయంత్, కుమార్తె రిషిత ఉన్నారు. అయితే ప్రతాప్ టీవీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైట్ నోట్‌లో వెల్లడించారు. ఇటీవల స్నేహితులు, బంధువులు మరణించారని మనస్తాపానికి గురైనట్లు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలంలో ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, వీరి ఆత్మహత్యకు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాలు నిజమా.. ? కదా అని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ కుటుంబంలో నలుగురు ఆత్మహత్యపై ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.