Revenue system: తండ్రి, కొడుకు ఆత్మహత్య.. రెవెన్యూ అధికారుల పాపమే అంటోన్న స్థానికులు

|

Aug 08, 2021 | 3:06 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణాలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో కోటవీధికి చెందిన తండ్రి, కొడుకు అత్మహత్యలకు పాల్పడ్డారు. తమ పొలంను ఎలాంటి హక్కు లేని

Revenue system: తండ్రి, కొడుకు ఆత్మహత్య.. రెవెన్యూ అధికారుల పాపమే అంటోన్న స్థానికులు
Nandyala
Follow us on

Revenue system – Nandyala – Father Son Suicide: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణాలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో కోటవీధికి చెందిన తండ్రి, కొడుకు అత్మహత్యలకు పాల్పడ్డారు. తమ పొలంను ఎలాంటి హక్కు లేని ఇతరుల పేరుపై అన్ లైన్ చేయ్యడమే తండ్రి కొడుకుల అత్మహత్యకు కారణమని మృతుల బంధువులు చెబుతున్నారు. తండ్రి సుబ్బరాయిడు శవంతో తహశీల్దారు కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బాధితులు ధర్నాకు దిగారు.

Nandyala Locals

ఆత్మాభిమానం గల తండ్రి, కొడుకుల అత్మహత్యకు ముమ్మాటికీ రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమలే కారణమని మృతుల బంధువులు, స్థానికులు అరోపిస్తున్నారు. ఇదిలాఉంటే, తన భూముల వివరాల కోసం రెవెన్యూ ఆఫీసుకు వెళ్లిన ఒక వ్యక్తి ప్రభుత్వోద్యోగిని కులంపేరుతో అవమానించిన ఘటన తమిళనాడులో నెలకొంది.

Nandyala Victims

ప్రభుత్వోద్యోగికి అవమానం:

తమిళనాడులో కులం పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని అవమానించారు. కోయంబత్తూర్‌లోని అన్నూర్‌ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ముత్తుస్వామిని.. కాళ్లమీద పడి క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. తన భూముల వివరాల కోసం పంచాయతీకి వెళ్లిన గోపాలస్వామి అనే వ్యక్తి.. అక్కడ మహిళా ఉద్యోగితో దురుసుగా మాట్లాడాడు. ఈ వ్యవహారంలో ముత్తుస్వామి, గోపాలస్వామి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలో ముత్తుస్వామి దళితుడని కులం పేరుతో అవమానించాడు గోపాలస్వామి. తన కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పకపోతే తన పలుకుబడితో ఉద్యోగం తీసేయిస్తానని బెదిరించాడు. దీంతో అతని కాళ్ళమీద పడి క్షమాపణ చెప్పాడు ముత్తుస్వామి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌.. విచారణకు ఆదేశించారు.

Read also: Komatireddy: ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఇప్పుడే రిజైన్ చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయం. కావాలంటే బాండ్ రాసిస్తాం: కోమటిరెడ్డి