Orvakal airport: కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. 28వ తేదీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు

|

Mar 21, 2021 | 12:49 PM

ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు. ఓర్వకల్ లోని కర్నూల్ ఎయిర్ పోర్టు కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

Orvakal airport: కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. 28వ తేదీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు
Cm Jagan Orvakal Airport
Follow us on

ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు. ఓర్వకల్ లోని కర్నూల్ ఎయిర్ పోర్టు కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరకాల వలవన్, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి లు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభోత్సవం తర్వాత ఈనెల 28వ తేదీన కర్నూలు ఎయిర్ పోర్టు నుండి మొదటి కమర్షియల్ ఫ్లైట్ బెంగళూరు నుండి కర్నూలుకు వస్తుందన్నారు కలెక్టర్‌ వీరపాండియన్‌. అనంతరం కర్నూలు నుండి వైజాగ్ తిరిగి వైజాగ్ నుండి కర్నూలు, కర్నూలు నుండి చెన్నై తిరిగి చెన్నై నుండి కర్నూలుకు ఫ్లైట్స్ రన్ అవుతాయని, ఈ సర్వీసులు రెగ్యులర్ గా జరుగుతాయన్నారు కలెక్టర్‌. మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, చెన్నైలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నగరాలకు కూడ కనెక్టివిటీ ఫ్లైట్స్ రన్ కోసం ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారు.

గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల కోసం హడావుడిగా అరకొర పనులు చేశాడని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పనులను సంపూర్ణంగా పూర్తి చేసి ప్రారంభిస్తున్నారని పాన్యం ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. అందరికీ ఉపయుక్తంగా ఉండే పద్దతిలోనే ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే కాటసాని. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.

Also Read:  TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం

జూన్ 1 తర్వాత ఇది లేకుండా బంగారం అమ్మరాదు.. కొనరాదు.. ఎందుకో తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..