Kurnool: ఇంటి వాటర్ ట్యాంక్‌లో అనుమానాస్పదంగా కనిపించిన కవర్.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా..
రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. నాటుబాంబులు పేలాలన్న, సుమోలు గాలిలో ఎగరాలన్న అదే సీమ ఫ్యాక్షన్ నిజానికే సాధ్యం.. ఒక్కపుడు సీమ సందులలో నాటుబాంబులు మోతతో ఎప్పుడు మార్మోగుతూ వార్తలలో నిలిచేది సీమ ప్రాంతం.
కర్నూల్ న్యూస్, జులై 26: రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. నాటుబాంబులు పేలాలన్న, సుమోలు గాలిలో ఎగరాలన్న అదే సీమ ఫ్యాక్షన్ నిజానికే సాధ్యం.. ఒక్కపుడు సీమ సందులలో నాటుబాంబులు మోతతో ఎప్పుడు మార్మోగుతూ వార్తలలో నిలిచేది సీమ ప్రాంతం. ఇక్కడి ఫ్యాక్షన్ పై పలు సినిమాలు కూడా వచ్చాయి అంటే ఈ సీమ రాజకీయం ఎంత ఫెమసో అర్థం అవుతుంది. ఈ ఫ్యాక్షన్ నిజానికి ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఎందరో జైలలో మగ్గుతున్నారు. గత కొంతకాలంగా సీమలో ఫ్యాక్షన్ గొడవలు జరగడం లేదనే చెప్పచ్చు. కానీ 22 నాటుబాంబులు దొరకడం, అదికూడా ఇంటి వాటర్ ట్యాంకు లో దొరకంతో ఒక్కసారిగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ఉలిక్కిపడ్డారు. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో దొరికిన నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొత్త ముచ్చుమర్రి గ్రామం నియోజకవర్గం లో ఫ్యాక్షన్ కు పేరొందిన గ్రామం. కొత్త ముచ్చుమర్రి గ్రామంలో మధు అనే వ్యక్తి ఇంటి పైన వాటర్ ట్యాంక్ లో 22 నాటు బాంబులు దొరకడం కలకలం రేపింది. నాటు బాంబుల ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఒకే సారి 22 నాటు బాంబులు పోలీసులకు దొరకడంతో గ్రామంలో ను, నియోజకవర్గ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ నాటుబాంబులు తీసోకొచ్చారా?లేదా? ఎవ్వరి పైన వేయడానికి ఈ నాటుబాంబులు తెచ్చారా అని నియోజకవర్గ ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. ముచ్చుమర్రి గ్రామం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,ప్రస్తుత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్వగ్రామం కావడం. పైగా ఈ ఇద్దరు మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉంది. ఇద్దరు ఫ్యాక్షన్ నేపథ్యం గల ఒకే కుటుంబం నుంచి రాజకీయాలలో వచ్చి ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా నాటుబాంబులు దొరకడంతో ప్రజలలో ఎప్పుడు ఏమి జరుగుతోందని భయాందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..