Black Magic: కర్నూలు జిల్లా నంద్యాల శివారులో క్షుద్రపూజల కలకలం రేపింది. ఎస్.బి.ఐ కాలనీ సమీపంలోని పెద్ద చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు. వింతపూజల ఆనవాళ్లతో స్దానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నంద్యాల శివారుచెరువు కట్టపై నిత్యం నడిచే వాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలా క్షుద్రపూజలు చేసారా? లేక మరే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు స్దానికులు వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిక్షేపాల కోసం, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే చేసే క్షుద్రపూజలు బహిరంగ ప్రదేశంలో చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు, ఇది ఆకతాయిల పనిగా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల్ని భయపెట్టాలనే ఆకతాయిలు ఇటువంటి క్షుద్రపూజలు సెట్టింగ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఏది ఎమైన్పటికీ పట్టణ శివారులో ఎన్నాడూ లేని విధంగా క్షుద్రపూజలు జరగడం అనుమానాస్పదగా మారింది.
Also Read:
Porto captain Pepe Fight: గ్రౌండ్‌లో కొట్టుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్లు.. వైరల్‌గా మారిన వీడియో..