Nandyala: పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు.. కానీ అంతలోనే…

ఈనెల 30న ఆ యువకుడికి పెళ్లి కావాల్సి ఉంది. కానీ అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పనుల్లో భాగంగా బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన యువకుడు. పత్రికలు పంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంతో మృతి చెందాడు. మరో తొమ్మిది రోజుల్లో పెళ్లి ఉండగా కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Nandyala: పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాడు.. కానీ అంతలోనే...
Nandyala

Edited By: Anand T

Updated on: Apr 21, 2025 | 3:46 PM

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణాని చెందిన నాగేంద్ర అనే యువకుడికి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 30న ఆ యువకుడికి పెళ్లి కావాల్సి ఉంది. అయితే పెళ్లి పనుల్లో భాగంగా బంధువులకు పెళ్లి పత్రికలను పంచేందుకు వెళ్లాడు నాగేంద్ర. పెళ్లి పత్రికలు పంచి ఇంటికి వస్తుండగా పాములపాడు మండల కంబాలపల్లెలో వద్ద నాగేంద్ర బైక్‌ను ఓ బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల్లో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. నాగేంద్ర మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..