Adoni: పోలీస్ స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో సొమ్ము మాయం.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం

|

May 01, 2024 | 9:44 PM

పోలీస్ స్టేషన్‌లోనే చోరీ.. ఏకంగా లక్షల్లో నగదు మాయం.. విస్తుపోయిన పోలీసులు.. వెంటనే ఇన్వెస్టిగేషన్ షురూ చేశారు. అవును.. కర్నూలు జిల్లా ఆదోలు పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‍‌లో నగదు మాయమైంది. బీరువా లాకర్లలో ఉంచిన సుమారు ఐదున్నర లక్షల నగదు కనిపించకుండాపోయింది. ఆ తర్వాత...

Adoni: పోలీస్ స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో సొమ్ము మాయం.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం
Kurnool Police
Follow us on

మన ఇళ్లకి ఎవరైనా కన్నాలు వేస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్తాం.. మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ జరిగితే.. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ఓ వ్యక్తి చోరీ చేశాడు. వామ్మో పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనామా.. అన్ని గుండెలు ఎవరికి ఉన్నాయ్ అనుకుంటున్నారా..? ఇంకెవరికీ అక్కడ పనిచేసే.. ఓ పోలీసే. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం. ఈ ఘటన గురించి తెలిసినవారందరూ నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..  కర్నూలు జిల్లా ఆదోలు పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‍‌లో పెద్ద మొత్తంలో నగదు మాయమైంది. బీరువా లాకర్లలో ఉంచిన 5.63 లక్షల సొత్తు మాయమైంది. అయితే బీరువా ఏం డ్యామేజ్ కాలేదు.  తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. దీంతో నగదు ఎలా పోయిందో పోలీసులకు అర్థం కాలేదు. ఇది ఇంటి దొంగల పనే అనుకున్నారు. ఆ తర్వాత విచారణలో  బీరువాలో సొమ్ము చోరీ చేసింది హోంగార్డేనని తేలింది. వివిధ కేసుల్లో దొరికిన నగదును ఆదోని టూటౌన్ పోలీసులు ఓ బీరువాలో పెడుతూ ఉంటారు. నమ్మకమైన వ్యక్తి కావడంతో.. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న మనోజ్‌‌కు వివిధ పనుల నిమిత్తం ఈ బీరువా తాళాలు ఇచ్చేవారు. కీలకమైన ఫైళ్ల కూడా అందులోనే పెట్టేవారు. అయితే ఫైళ్లు అందించే సమయంలో మనోజ్.. ఈ డబ్బు కాజేశాడు.

ఆ తర్వాత తనకేం తెలియనట్లు బిహేవ్ చేసేవాడు. అయితే బీరువాలో దాచిన డబ్బు… లెక్కల్లో తేడా రావటంతో పోలీసుల్లో అలజడి మొదలైంది. దీంతో హోంగార్డు మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం పోలీసులు అతని వద్ద నుంచి 3 లక్షల నగదు రికవరీ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..