AP News: అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పోలీసులను అప్రోచ్ అయ్యారు. అండగా నిలవాల్సిన అధికారి.. బేరానికి దిగాడు. నాకెంత ఇస్తావ్ అని ముఖం మీదే అడిగేశాడు. దీంతో స్టన్ అయిన ప్రేమికులు.. ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో లంచగొండి ఎస్ఐపై ఎట్టకేలకు వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే… ప్రేమ పెళ్లికి సహకరించాలని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోరిన జంట నుంచి 50 వేలు డిమాండ్ చేసిన కర్నూలు జిల్లా(Kurnool District) తుగ్గలి(Tuggali) ఎస్సై సమీర్ భాషపై వేటు పడింది. తుగ్గలి నుంచి వి.ఆర్ కు పిలిపిస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. డబ్బుల కోసం ఎస్సై వేధిస్తున్నాడని బాధితుడు రాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ చేయించిన ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 10 వేల రూపాయలు ఎస్సై తన భార్య నంబర్‌కు ఫోన్ పే చేయించుకున్నట్లు రాజు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..