
భూమిపై నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. బాలుడు రోళ్లుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. సడెన్‌గా ఓ విద్యుత్ స్థంభం కూలి బాలుడిపై పడబోయింది. గమనించిన బాలుడు తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ దృశ్యాలు చూసిన స్థానికులందరూ ఆ బాలుడికి నిండు నూరేళ్లు ఉన్నాయని చర్చించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు నగరంలోని అశోక్ నగర్ లో ఈ ప్రమాదం వెలుగు చూసింది. కాలనీలో కాలువలు మరమ్మత్తులు చేస్తున్నారు కార్మికులు. అదే సమయంలో అటుగా ఓ విద్యార్థి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో సడెన్‌గా రోడ్డు పక్కన ఉన్న ఓ స్థంభం కూలిపోయింది. అది గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో అలర్ట్ అయిన బాలుడు రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఇవి కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు అంతా భూమిపై నూకలు ఉన్నాయంటే ఇదేనేమో అనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.