AP ENC Letter to KRMB: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత రాజుకుంటోంది. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌పై ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి KRMBకి ఫిర్యాదు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ENC నారాయణరెడ్డి దీనిపై లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లపై రెండు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. బోర్డు అనుమతి లేకుండా, ఏపీ వైపు నుంచి ఇండెంట్ లేకుండా ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా TS జెన్‌కో ఉత్పత్తి చేస్తోందన్నారు. వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలని KRMBని కోరారు AP ENC నారాయణరెడ్డి.
మరోవైపు, ఇప్పటికే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
KRMBకి ఫిర్యాదు చేసింది ఏపీ సర్కార్.