Kondapalli Municipality: హైకోర్టులో 16వ ఓటు పంచాయితీ.. టై అయితే టాసేనా.. కొండపల్లి కోటపై సస్పెన్స్..

|

Nov 25, 2021 | 9:01 AM

ఒక్క ఓటు విజయవాడ ఎంపీ కేశినేని నానీదే.. కొండపల్లి మున్సిపాలిటీలో ఆయన వేసిన ఓటు చెల్లుతుందా లేదా.. నానీ ఓటుకు విలువుందా లేదా.. కాసేపట్లో కోర్టు చెప్పబోయే తీర్పుతో..

Kondapalli Municipality: హైకోర్టులో 16వ ఓటు పంచాయితీ.. టై అయితే టాసేనా.. కొండపల్లి కోటపై సస్పెన్స్..
Election Of Kondapalli Muni
Follow us on

ఒక్క ఓటు విజయవాడ ఎంపీ కేశినేని నానీదే.. కొండపల్లి మున్సిపాలిటీలో ఆయన వేసిన ఓటు చెల్లుతుందా లేదా.. నానీ ఓటుకు విలువుందా లేదా.. కాసేపట్లో కోర్టు చెప్పబోయే తీర్పుతో టీడీపీ భవిష్యత్‌, కొండపల్లి మున్సిపాలిటీ భవిష్యత్‌ తేలిపోనుంది. అంతకుముందు రెండుసార్లు వాయిదా పడ్డ కొండపల్లి మున్సిపల్ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో నిన్న పూర్తయ్యింది. గెలుపు ఎవరిదో చెప్పొద్దన్న ఆదేశంతో సీల్డ్ కవర్‌లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి కోర్టుకు నివేదించారు. ఎన్నిక సాఫిగా ముగిసినా.. ఫలితంపై మాత్రం ఉత్కంఠ వీడలేదు. సరికదా.. టీడీపీని ఒక అడుగు ముందు ఉంచిన 16 ఓటుపై చిక్కుముడి కొనసాగుతోంది.

టీడీపీ తరఫున ఛైర్మన్‌గా చిట్టిబాబును టీడీపీ సభ్యులు ఎన్నుకోగా.. జోగి రామును వైసీపీ సభ్యులు బలపరిచారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీక్రెట్ ఓటింగ్‌ పెట్టాలని ఎన్నికల అధికారిని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. టీడీపీ మాత్రం మున్సిపల్ యాక్ట్‌లో సీక్రెట్ ఓటింగ్ లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు సభ్యులంతా చేతులెత్తి చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేశారు.

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఓటుతో వారి బలం 15కు చేరింది. టీడీపీ కూడా 14 వార్డుల్లోనూ విజయం సాధించింది. ఒక స్వతంత్ర అభ్యర్థి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు పెరిగింది.

ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానికి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది. కేశినేని కొండపల్లిలో ఎలా ఓటు వేస్తారు.. అది చెల్లదంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కోర్టు మాత్రం ఆలస్యం చెయ్యకుండా ముందు ఎన్నిక పూర్తిచేస్తే ఫలితం తాము నిర్ణయిస్తామన్నట్లు ప్రకటించింది. ఆ ఆదేశం మేరకు ఎన్నికైతే పూర్తయ్యిందిగానీ.. కేశినేని ఓటు, ఎన్నిక ఫలితంపై మాత్రం ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

టీడీపీ ధైర్యం చూస్తుంటే గెలిచినట్లే ఉంది. అందుకే సంబరాలు కూడా చేసేసుకుంది. వైసీపీ మాత్రం కోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి: Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..