AP Politics: ఎట్టకేలకు స్పష్టత.. పసుపు కండువా కప్పుకుంటున్న వైసీపీ నేత వైసీపీ నేత.. ఎప్పుడంటే..
గన్నవరం ను వదిలేది లేదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు యార్లగడ్డ.పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగానని.. నియోజకవర్గం లో పాదయాత్ర ద్వారా 95 శాతం ఇళ్ళకి వెళ్లానని చెప్పుకొచ్చారు.పార్టీ అధికారంలోకి వచ్చినా తమపై కేసులు మాత్రం తీయలేదని.. వైసీపీ కార్యకర్తల ను వంశీ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు.సుమారు మూడేళ్ళుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు . నాలుగు రోజుల క్రితం గన్నవరం లో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అంతే కాదు ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా బలనిరూపణకి దిగారు.అదే సమావేశంలో పార్టీ అధిష్టానంపై,స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.అమెరికా నుంచి ఏపీకి తిరిగోచ్చింది రాజకీయాలు చేయడానికేనని.
గన్నవరం ను వదిలేది లేదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు యార్లగడ్డ.పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగానని.. నియోజకవర్గం లో పాదయాత్ర ద్వారా 95 శాతం ఇళ్ళకి వెళ్లానని చెప్పుకొచ్చారు.పార్టీ అధికారంలోకి వచ్చినా తమపై కేసులు మాత్రం తీయలేదని.. వైసీపీ కార్యకర్తల ను వంశీ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
కార్యకర్తల సమక్షంలోనే సీఎం జగన్ ను గన్నవరం సీటు ఇవ్వాలని అభ్యర్దిస్తున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు లేదంటే తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని యార్లగడ్డ అన్నారు.అయితే యార్లగడ్డ విషయాన్ని వైసీపీ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది.పార్టీలో అందరికీ సమాన గౌరవం ఉంటుందని.. ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు లేదంటే వెళ్లిపోవచ్చంటూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు తాజాగా మరోసారి ముఖ్య అనుచరులతో సమావేశమైన యార్లగడ్డ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
గ్రూపు గొడవలకు ఫుల్ స్టాప్
యార్లగడ్డ వైసీపీని వీడి టీడీపీలో చేరితే గన్నవరం నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీలో ఉన్న గోడవలకు తెరపడినట్లవుతుంది.2019 ఎన్నికల్లో గన్నవరం లో వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వంశీ వైఎస్సార్సీపీ లో చేరడంతో పార్టీలో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి.వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ వెంకట్రావు,మరో సీనియర్ నేత దుట్టా రామచంద్ర రావు ఒక్కటయ్యారు.దీంతో రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది.వైసీపీ అధిష్టానం సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కృష్ణా జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా యార్లగడ్డ పనిచేశారు…ఆ తర్వాత పార్టీ కి దూరంగా ఉన్నారు…గన్నవరంలో వైసీపీ కి గుర్తింపు తీసుకువచ్చింది తానేనని….కానీ పార్టీ నన్ను పట్టించుకోలేదంటూ యార్లగడ్డ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు..నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైసీపీ నేతలు భావించారు. తాజాగా యార్లగడ్డ పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఇక వైసీపీలో గ్రూపు తగదాలకు చెక్ పడే అవకాశం ఉంది.
లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి..
వైఎస్సార్సీపీ ని వీడినట్లు చెప్పిన యార్లగడ్డ తెలుగుదేశం కండువా కప్పుకొనున్నారు.తాను ఇంతవరకూ చంద్రబాబు ,లోకేష్ ను గానీ టీడీపీ నేతలను గానీ కలవలేదని చెప్పారు అయితే చంద్రబాబు ను కలుస్తానని… అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.ఈ నెల 21న గన్నవరంలో లోకేష్ పాదయాత్ర జరగనుంది.ఆ తర్వాత భారీ బహిరంగ సభకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు..
లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తుంది..అయితే గన్నవరం టీడీపీ టిక్కెట్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది యార్లగడ్డ పార్టీలో చేరితే ఆయనకే టిక్కెట్ ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఆదేగనుక జరిగితే గన్నవరం లో 2019 ఎన్నికలు రివర్స్ లో జరగనున్నాయి.గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వంశీ పోటీ చేస్తే యార్లగడ్డ వైసీపీ నుంచి బరిలోకి దిగారు.కానీ 2024 లో మాత్రం వ్యక్తులు ఒక్కరే అయినా పార్టీలు మాత్రం మారుతాయి.అయితే పోటీ మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం