Kotipalli-narsapuram railway line: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్ష పార్టీల రాజకీయం రోజురోజుకూ వెడెక్కుతోంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ సమయాత్తమవుతోంది. ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైనుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా.. నేడు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ కోసం రాష్ట్ర (AP government) వాటాను నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు. అమలాపురంలో చేపట్టిన భారీ ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొంటారు. కాగా.. బీజేపీ ధర్నా నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నందున పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా.. 52 కిలోమీటర్ల కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 25 శాతం నిధులు సమకూర్చాలి. అయితే ఆ మొత్తాన్ని మంజూరుచేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.358 కోట్లు ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయని కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
Also Read: