
MLA Vundavalli Sridevi: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంబెడ్కర్ పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాన రహదారులపై దళిత సంఘాలు ఆందోళన దిగాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం రూరల్ పేరురు వై జంక్షన్ వద్ద దళితులు ఆందోళన చేపట్టారు. హైవే ను దిగ్బందం చేశారు. అణగారిన వర్గాలకు అంబెడ్కర్ ఎటువంటి హక్కులు కల్పించలేదు… బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమే అణగారిన వర్గాలకు మేలు చేశాడంటూ ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా కోనసీమ మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా చేశాసారు.
పేరూరు వై జంక్షన్ వద్ద సుమారు గంట సేపు హై వే దిగ్బందం చేశారు. ఉండవల్లి శ్రీదేవి డౌన్ డౌన్, అజ్ఞాన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అంటూ ప్ల కార్డు లు ప్రదర్శించి నినాదాలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే అంబెడ్కర్ కాళ్ళ మీద పడి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. తక్షణమే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
Also Read: