AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Riti Saha Death Case: బెంగాల్‌ విద్యార్థిని మృతి కేసులో వీడిన మిస్టరీ.. బైజూస్ సిబ్బంది సహా నలుగురు అరెస్ట్

Kolkata girl's death in Vizag: విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని అనమానాస్పద మృతి కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును అటు బెంగాల్ పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ విద్యార్ధిని రితీ సాహా అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు చేధించారు.

Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2023 | 9:11 PM

Share

Kolkata girl’s death in Vizag: విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని అనమానాస్పద మృతి కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును అటు బెంగాల్ పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ విద్యార్ధిని రితీ సాహా అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు చేధించారు. కాలేజ్‌ యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే రితీ సూసైడ్‌కు కారణమని తేల్చారు విశాఖ పోలీసులు. కేసులో సెక్షన్స్ మార్చి బైజూస్, హాస్టల్‌ సిబ్బందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో బెంగాల్‌ విద్యార్థిని రితీ సాహా కేసులో మిస్టరీ వీడింది. బైజూస్ సిబ్బంది, హాస్టల్ వార్డన్‌ అరెస్ట్ చేసిన పోలీసులు.. యాజమాన్యం నిర్లక్ష్యమే రితీ ఆత్మహత్యకు కారణమని నిర్ధారించారు. బైజూస్ మేనేజర్ రాజేశ్వర్ రావ్, ఆపరేషన్స్ హెడ్ రవికాంత్‌, సాధన హాస్టల్ యజమాని సూర్య కుమారి, వార్డెన్ గన్ను కుమారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈ కేసులో సెక్షన్‌ 174 నుంచి సెక్షన్‌ 304- పార్ట్ 11కి కేసు మార్పు చేశారు.

ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రితీసాహా.. జూలై 14న విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖలోని ఆకాష్ బైజూస్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటూ.. నరసింహనగర్ లోగల సాధనా హస్టల్‌లో రీతీసాహా ఉంటుంది. ఈ క్రమంలో హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి తండ్రి సుఖ్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేస్తూ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కంప్లైంట్ చేయడంతో ఆమె ఆదేశాలతో కోల్‌కతా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వారు కూడా విశాఖకు వచ్చి విచారణ జరుపుతున్న క్రమంలో వైజాగ్ పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..