TTD Tiruchanur Temple: తిరుచానూరు ఆలయంలో.. ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తోపాటు పాలకమండలి సభ్యులు అధికారులు పాల్గొన్నారు.అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారి గర్భాలయం శుద్ధి చేసిన అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు..

TTD Tiruchanur Temple: తిరుచానూరు ఆలయంలో.. ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
Koil Alwar Thirumanjanam

Edited By: Srilakshmi C

Updated on: Nov 07, 2023 | 7:02 PM

తిరుపతి, నవంబర్‌ 7: తిరుచానూరు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తోపాటు పాలకమండలి సభ్యులు అధికారులు పాల్గొన్నారు.అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారి గర్భాలయం శుద్ధి చేసిన అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం లో పాల్గొన్న టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈనెల 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

నవంబర్‌ 10న ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తరహాలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రత్యేక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 9.50 కోట్లతో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయ పుష్కరిణీ అభివృద్ధి చేశామన్నారు. ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం సేవకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన. గజవాహన సేవకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం 18న పంచమితీర్థానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తారన్నారు.

ఇవి కూడా చదవండి

విరాళంగా 15 పరదాలు

శ్రీ పద్మావాతి అమ్మవారి ఆలయానికి చైర్మన్ కరుణాకర రెడ్డి చేతుల మీదుగా భక్తులు 15 పరదాలను విరాళంగా అందించారు. హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 11, గుంటూరుకు చెందిన అరుణ్ కుమార్, పద్మావతి, తిరుచానూరుకు చెందిన పవిత్ర, రజిని ఒక్కొక్కటి చొప్పున నాలుగు పరదాలను విరాళంగా అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.