సాధారణంగా అనకొండ, త్రాచుపాము పేర్లు వింటేనే మనుషులు భయపడుతుంటారు. అలాంటిది అవి కనిపిస్తే చాలు ఆమడదూరం పారిపోతారు. ఒకవేళ త్రాచుపాము జనావాసాల్లో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! హార్ట్ ఎటాక్ వచ్చేసినట్లే.! ఈ మధ్యకాలంలో విషసర్పాలు జనాల్లోకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సంఘటన తాజాగా విశాఖపట్నంలో ఒకటి జరిగింది. స్థానిక సింధియా కూడలిలోని నేవల్ క్వార్టర్స్ వద్ద అరుదైన త్రాచుపాము హల్చల్ చేసింది. సుమారు 10 అడుగుల పొడువు ఉన్న బంగారు వర్ణంలో కనిపించిన ఆ త్రాచుపామును చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.
పాములు పట్టడంలో అనుభవం ఉన్న నాగరాజు అనే వ్యక్తి అక్కడికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టి బంధించాడు. ఆ పాము చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి పాములు శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయని.. విశాఖ ప్రాంతాల్లో చూడటం ఇదే మొదటిసారి అని నాగరాజు చెప్పాడు. ఈ విషయాన్ని జూపార్క్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి.. పామును వాళ్లకి అప్పగిస్తానని తెలిపాడు.
Also Read:
మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!
మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!