
తిరుమలలో భక్తులకు పాముల భయం వెంటాడుతోంది. శేషాచలం అటవీ ప్రాంతంలోని విష సర్పాలు తరచూ కనిపిస్తుండడంతో భక్తుల్లో వణుకు పుడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ కనిపిస్తున్న పాములను చూసి భక్తులు పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. నడక మార్గాల్లోనే కాకుండా భక్తులు సేద తీరే చోట్ల, వీఐపీలు బస చేసే కాటేజీలు, స్థానికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పాములు కనిపిస్తున్నాయి. ఏకంగా 8 నుంచి 10 అడుగుల కొండచిలువలు నుంచి పరిగెత్తి బుసలు కొట్టే విష నాగులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తిరుమల విఐపి కాటేజీలో ఓ నాగుపాము కనిపించింది.
వీఐపీలు బస చేసే స్పెషల్ టైప్ విశ్రాంతి భవనంలోకి నాగుపాము ప్రవేశించింది. 14 వ నంబర్ కాటేజీ లో దర్శన మిచ్చిన నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు.. భక్తులు గది నుంచి బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో పాములను పట్టే టిటిడి ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు నాగుపాము పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..