Andhra: ఇదేం పామురా సామీ..! స్వీట్స్ చూస్తేనే పడి చచ్చిపోతుంది.. వీడియో చూశారా

అది విశాఖలోని అగనంపూడి ప్రాంతం.. అక్కడే ఒక స్వీట్లు తయారీ చేసే ఇల్లు.. ప్రతిరోజు అక్కడే స్వీట్లు తయారుచేసి స్వీట్ షాపులకు సరఫరా చేస్తూ ఉంటారు.. రోజు మాదిరిగానే అందరూ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఓ మూల ఏదో శబ్దం వినిపిస్తోంది. ఎలుకలేమో అనుకున్నారు అంతా..

Andhra: ఇదేం పామురా సామీ..! స్వీట్స్ చూస్తేనే పడి చచ్చిపోతుంది.. వీడియో చూశారా
Snake

Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2025 | 12:17 PM

విశాఖ అగనంపూడి రాజీవ్ నగర్ సమీపంలో స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. అక్కడ వేరు వేరు రకాల స్వీట్లు తయారుచేసి షాప్‌నకు వేస్తారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యే సమయంలో ఒక్కటే అలజడి.. ఓ భారీ గోధుమ నాగు..! పొడవు దాదాపుగా ఆరడుగుల ఉంటుంది. శబ్దాలతో హడలెత్తిస్తోంది. సామాన్ల ఇరుకులో అటు ఇటు తిరుగుతూ ఉంది. అక్కడే ఉన్న వారంతా ఆ దృశ్యం చూసి పరుగులు తీశారు. వెంటనే స్నేక్ కేచర కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. ఆ పామును రెస్క్యూ చేయబోయాడు. అప్పటికే హడలెత్తి ఉన్న ఆరడుగుల గోధుమ నాగు.. స్నేక్ క్యాచర్‌పై ఎదురు తిరగబోయింది. దాడి చేసేందుకు యత్నించింది. తృటిలో తప్పించుకున్న కిరణ్.. భారీ గోధుమ నాగును అత్యంత చాకచక్యంగా బంధించాడు.

స్వీట్లు తయారు చేసే ఆ ఇంట్లో ఆ పాము ఎందుకు వచ్చిందని అంతా చర్చించుకున్నారు. పాముకు స్వీట్లు అంటే ఇష్టమా అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఆ స్నేక్ క్యాచర్‌కు ఒక విషయం తెలిసింది. అదేంటంటే అక్కడే స్వీట్లు తినేందుకు ఎలుకలు సంచారం ఉంటుంది. ఆ ఎలుకలను ఆహారంగా తినేందుకు భారీ గోధుమ నాగు వచ్చి ఉంటుందని స్నేక్ క్యాచర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గోధుమ నాగును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.