ఇటీవల కాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఇక అలా జనావాసాల్లోకి వచ్చిన సరీసృపాలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరచుగా జరిగిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. వాటిని మనం తరచూ దేశంలోని నలమూలల చూస్తూనే ఉంటాం. ఆ పాములకు సంబంధించిన ఘటనలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి ఒంగోలులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.!
తెల్లారితే ఆదివారం.. యధావిధిగా శనివారం రాత్రి నుంచే ఆదివారం ప్రార్ధనలకు చర్చిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు చర్చి నిర్వాహకులు.. అయితే పిలవని పేరంటానికి వచ్చినట్టు అనుకోని అతిధిలా ఐదడుగుల త్రాచుపాము చర్చిలో ప్రత్యక్షం అయింది.. దీంతో చర్చిలోని జనం భయంతో వణికిపోయారు.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు.. సమాచారం అందుకున్న వెంటనే చర్చి దగ్గరకు చేరుకున్న స్నేక్ క్యాచర్ తాచుపామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలి వేసేందుకు తీసుకెళ్ళడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కాలంలో వర్షాలకు తాచుపాములు ఇళ్ళల్లోకి, జనావాస ప్రాంతాల్లోకి తరచుగా వస్తున్నాయి.. అలాగే రాత్రి పూట సంచారం లేని దేవాలయాల్లోకి వస్తుంటాయి.. ఇలా దేవాలయాలలోకి వచ్చిన పాముల్ని చూసి నాగదేవత వచ్చిందంటూ భక్తులు భక్తితో నమస్కరించడం చూస్తుంటాం.. అయినా పాము కాటేస్తుందన్న భయంతో దాన్ని జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లోకి వదిలేస్తుంటారు.. అయితే ప్రస్తుతం ఇక్కడ మాత్రం తాచుపాము ఓ చర్చిలో దూరండంతో కలకలం రేగింది.
చర్చిలో ఐదు అడుగుల త్రాచుపాము ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.. ప్రకాశంజిల్లా తర్లుపాడులోని ఎస్‌సి కాలనీలోని చర్చిలో ఐదు అడుగుల ప్రమాదకరమైన త్రాచు పాము వచ్చింది.. మెట్లకింద కూర్చుని బుసులు కొట్టింది.. దీంతో అక్కడ ఉండే స్థానికులు భయభ్రాంతులకు గురై ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న స్నేక్ క్యాచర్ నిరంజన్ చాకచక్యంగా ఐదు అడుగుల త్రాచు పాముని పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. పామును ఎలాంటి ప్రమాదం లేకుండా పట్టుకోవడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.. పట్టుకున్న పాముని దోర్నాల సమీపంలోని నల్లమల ఫారెస్ట్ లో విడిచిపెట్టనున్నట్లు నిరంజన్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..