Andhra Pradesh: హాట్ హాట్‌గా విజయవాడ టీడీపీ రాజకీయాలు.. బాబుతో చిన్ని భేటీపై ఆసక్తికర చర్చ..

టీడీపీ అధినేత చంద్రబాబును, విజయవాడ టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని కలవడంపై.. ప్రకాశం బ్యారేజీ మీద తెగ చర్చ జరుగుతోంది. బాబు ఇంటికి వెళ్లిన కేశినేని చిన్ని..

Andhra Pradesh: హాట్ హాట్‌గా విజయవాడ టీడీపీ రాజకీయాలు.. బాబుతో చిన్ని భేటీపై ఆసక్తికర చర్చ..
Kesineni Chinni

Updated on: Feb 01, 2023 | 9:27 AM

టీడీపీ అధినేత చంద్రబాబును, విజయవాడ టీడీపీ నాయకుడు కేశినేని చిన్ని కలవడంపై.. ప్రకాశం బ్యారేజీ మీద తెగ చర్చ జరుగుతోంది. బాబు ఇంటికి వెళ్లిన కేశినేని చిన్ని.. పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ శతయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు.. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, మెగా మెడికల్ క్యాంపుల గురించి చర్చించామంటున్నారు కేశినేని చిన్ని. కానీ విజయవాడలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైనే చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్యే కొన్ని రోజులుగా అభిప్రాయబేధాలు నడుస్తున్నాయి. నీతి, నిజాయితీ, క్యారెక్టర్‌ ఉన్న అభ్యర్థి అయితేనే.. సపోర్ట్ చేస్తాననీ ఎంపీ కేశినేని నాని ఇటీవలే కామెంట్ చేశారు. ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడి ఉంటారని.. చంద్రబాబును సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు కేశినేని చిన్ని. ఈ క్రమంలో బాబును కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..