Kapu Nadu: ఈ నెల 26న విశాఖలో కాపునాడు.. పవన్ ను సీఎంగా ప్రకటిస్తే వారికే తమ సపోర్ట్ అంటోన్న కాపు నేతలు..
కాపుల్లో ఐక్యత లేదన్నది పాత మాట. కాపులంతా ఒక్కటే. ఇదే కొత్త తరం బాట. ఒకప్పుడు రంగా బొమ్ము పెట్టుకుని ముందుకెళ్లేందుకు కూడా భయపడేవారనీ. ఇప్పుడా మాటకు తావు లేదు. కాపుల్లో ఐక్యత సాధించడమే లక్ష్యంగా, కాపులు రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా అనిపిస్తోంది అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన నేతల మధ్య మాటల యుద్ధం చూస్తుంటే.. ఇరు పార్టీ నేతలు నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్న చెందగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రానున్న ఎన్నికలల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఏ పార్టీతోనైనా కలిసి వెళ్తుందా అని వైసీపీ నేతల సహా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అన్న మాటకు తావు లేదు. ఆయనే కింగ్.. ఇదే మా టార్గెట్. అదే జరిగితే ఏ పార్టీకైనా తాము మద్ధతు ప్రకటిస్తామంటోంది రాధా రంగ ఆర్గనైజేషన్.. పూర్తి వివరాలోకి వెళ్తే..
పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తామంటున్నారు రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ వారు. అది టీడీపీ అయినా మరే పార్టీ అయినా సరే మాకు సంబంధం లేదనీ. ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్ అభిప్రాయం కూడా తాము తెలుసుకోదలుచుకోలేదనీ. మా ఆలోచన మాత్రం ఇదేనంటున్నారు ఈ ఆర్గనైజేషన్ నిర్వాహకులు.
కాపుల్లో ఐక్యత లేదన్నది పాత మాట. కాపులంతా ఒక్కటే. ఇదే కొత్త తరం బాట. ఒకప్పుడు రంగా బొమ్ము పెట్టుకుని ముందుకెళ్లేందుకు కూడా భయపడేవారనీ. ఇప్పుడా మాటకు తావు లేదు. కాపుల్లో ఐక్యత సాధించడమే లక్ష్యంగా, కాపులు రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా.. తమ రాధా- రంగ ఆర్గనైజేషన్ పని చేస్తుందని అంటున్నారు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గాదె బాలాజీ. తాము నిర్వహించనున్న.. సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాపు ప్రతినిథులు వస్తారనీ. రెండు ప్రాంతాల్లో ఉన్న కాపు నాయకులందరినీ ఆహ్వానిస్తున్నామనీ.. తామిక కింగ్ మేకర్ పొజిషన్లో ఉండ దలుచుకోవడం లేదనీ. ఇకపై కాపులు కింగ్ పాత్ర పోషించాలనుకుంటున్నామనీ అంటున్నారు గాదె బాలాజీ.
ఈ నెల 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కాపునాడు మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు గంటా శ్రీనివాసరావు. కాపునాడు రీ ఆర్గనైజేషన్ ఒక ఆశయం కోసం పని చేస్తోందని, అదేంటో సరైన సమయంలో తెలుస్తుందని వ్యాఖ్యానించారు గంటా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..