Viral: గార్డెన్‌లో సేద తీరుతున్న భక్తులు.. సడెన్‌గా కనిపించిన అనుకోని అతిథి.. దెబ్బకు హడల్..
Andhra Pradesh: సరీసృపాలు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది..

సరీసృపాలు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. సహజంగానే అటవీ ప్రాంతాల్లో పాములు, కొండచిలువలు ఎక్కువగానే ఉంటాయి. అప్పడప్పుడూ జనాలను హడలెత్తిస్తుంటాయి. ఇటీవల తిరుమల కొండపై ఓ భారీ కొండచిలువ భక్తులను భయపెట్టేసింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే..
తిరుమల కొండపై భారీ కొండచిలువ ఒకటి హల్‌చల్ చేసింది. సుమారు 13 అడుగుల పొడవున్న కొండచిలువను చూసి భక్తులు హడలిపోయారు. కళ్యాణ వేదిక సమీపంలోని గార్డెన్‌లో భక్తులు సేద తీరుతుండగా.. అనుకోని అతిధి వలె వచ్చి వారిని కంగారుపెట్టింది. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తిరుమల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సాయంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. కాగా, ఈ పాము చాలా ప్రమాదకరమైనదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎవ్వరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.