Mudragada-Ap CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి(AP CM Jagan) కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudrasgada Padmanabham) మరో లేఖ సారి లేఖాస్త్రాన్ని సంధించారు. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం తాజాగా మరోసారి ఓటీఎస్ పై బహిరంగ లేఖను రాశారు. ఓటీఎస్ విధానంపై జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సిఎం జగన్ ను ముద్రగడ కోరారు. గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా సీఎంను కోరారు ముద్రగడ.
గతంలో ఎప్పుడో పేదవారికిచ్చిన రుణాలను ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేయడం ఇప్పటి వరకూ జరగలేదని అసలు పేదవారి ఇళ్ళకు ఇచ్చిన అప్పును తప్పని సరిగా కట్టమని ఎ ప్రజాప్రతినిధి కూడా చెప్పిన సందర్భం ఇవ్వరకూ రాలేదని అన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు… గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది అంటూ సీఎం వైఎస్ జగన్‌ను ముద్ర గడ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు ముద్రగడ. ఇప్పటికే ఓటీఎస్ విధానంపై అనేక విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్.. శుక్రవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక సవరణలకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
Also Read: యువతి పార్ట్ టైం జాబ్.. వార్డ్ రోబ్ లో బట్టలు సర్దుతూ నెలకు 50 వేల సంపాదన..