Makar Sankranti 2022: ఎమ్మెల్యే రోజా ఇంట ఘనం సంక్రాంతి సంబరాలు.. కనుమనాడు గోమాతకు పూజలు..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఎవరి ఇంట్లో వారు వైభవంగా జరుపుకుంటున్నారు. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా..

Makar Sankranti 2022: ఎమ్మెల్యే రోజా ఇంట ఘనం సంక్రాంతి సంబరాలు.. కనుమనాడు గోమాతకు పూజలు..
Mla Roja
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 16, 2022 | 7:13 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఎవరి ఇంట్లో వారు వైభవంగా జరుపుకుంటున్నారు. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజా తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. సంక్రాంతి పండుగల్లో మూడో రోజు కనుమ నాడు వ్యవసాయ క్షేత్రంలో తమతో పాటు పనిచేసే పశువులను పూజ చేయడం తెలుగువారి సంప్రదాయం.. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రోజా కనుమ పండగ రోజున ఇంటికి ఆవు, దూడను ఆహ్వానించారు.

ఆవుకు పసుపు కుంకుమతో అలంకరించి హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ వేడుకలో రోజా భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకులు కూడా పాల్గొన్నారు.

ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.