Kanna Lakshminarayana: ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా.. బీజేపీకి రాంరాం చెప్పే పనిలో ఉంటే.. వాట్ నెక్ట్స్
క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఆంజనేయ భక్తుడు రాజకీయంగా మరోసారి దూకుడు పెంచారా.. ఒకప్పుడు మిర్చి జిల్లాను శాసించిన ఆయన ఇప్పుడు కాషాయ పార్టీ నుంచి మరో పార్టీ వైపు చూస్తున్నారా..

ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ దూరం అవుతున్నారా.. ఇదే ప్రచారం జోరందుకుంది. నిన్న పవన్ కల్యాణ్ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే కన్నా కూడా అలాంటి అసహనమే చూపిస్తున్నారు. అంతేకాదు.. తన అనుచరులతో ఓ సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ మొత్తం సీన్‌లో సడెన్‌గా రైజ్ అవుతున్న క్వశ్చన్. ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీకి రాంరాం చెప్పే పనిలో ఉంటే.. వాట్ నెక్ట్స్ ! ఆయన దారి జనసేన వైపా.. టీడీపీ వైపా? ఎన్‌ఎస్‌యూఐ లీడర్‌గా కొనసాగుతూ రాజకీయాల్లోకి వచ్చిన కన్నా.. పూర్తిస్థాయి యాక్టివ్ రోల్‌లో ఉన్నది మాత్రం కాంగ్రెస్‌లోనే. ఆరుసార్లు ఎమ్మెల్యేలుగానే కాదు.. అనేక మంత్రిత్వ శాఖలనూ నడిపారు. రాజశేఖరెడ్డి ఉన్నంతవరకూ ఆ పార్టీ టాప్ 5లో కన్నా కూడా ఉండేవారు. ఏపీ విడిపోయిన తర్వాత.. కొన్నిరోజులు కీ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్నా మళ్లీ ఏపీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. సోమువీర్రాజు అధ్యక్షుడు అవ్వడానికి ముందు వరకూ ఏపీ బీజేపీని నడిపించింది కన్నా లక్ష్మీనారాయణే. అయితే.. ఆ హోదాలోకి సోము వచ్చిన తర్వాత మళ్లీ ఆయన పలుకుబడి తగ్గినట్లుగా కనిపించింది. నమ్మిన బీజేపీ నుంచే సరైన గౌరవం లేదన్నది కన్నా లక్ష్మీనారాయణ మనసులోమాటగా కనిపిస్తోంది. మొత్తంగా.. కోస్తాంధ్రలో సత్తా ఉన్న వ్యక్తిగా పొలిటిక్స్‌ను లీడ్ చేసిన కన్నా ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారన్నదే ప్రశ్న.
కన్నా లక్ష్మీనారాయణ అడుగంటూ పడితే ఎటువైపు.. టీడీపీ వైపా.. జనసేన వైపా?
కన్నా రాజకీయ ప్రస్తానం మొదలైందే యాంటీ టీడీపీ కాన్సెప్ట్‌తో. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకూ ఆ పార్టీకి ఆగర్భ రాజకీయ శత్రుత్వం. కానీ ఏళ్లకుఏళ్లుగడిచే కొద్దీ ఇప్పుడు ఆ వైరం తగ్గినట్లుగా కనిపిస్తోంది. అమరావతి ఉద్యమ వేదికగా టీడీపీతో సత్సంబంధాలు కాస్త మెరుగుపడ్డట్లే ఉన్నాయి. చంద్రబాబుతో కానీ, ఆ పార్టీ నేతలతోగానీ రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత వైరం లేదుకదా అనే ఆలోచన వరకూ తీరు మారింది. అంతేకాదు.. గుంటూరు-2లో టీడీపీ తరఫున గెలిచిన మద్దాలి గిరి వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆ పార్టీ కూడా ఓ దమ్మున్న లీడర్ కోసం చూస్తోంది. కన్నా వస్తే ఆ గ్యాప్ ఫిల్ అవుతుందన్న నమ్మకంతో టీడీపీ కూడా కన్నాను అప్రోచ్ అవుతున్నట్లే చెబుతున్నారు. బీజేపీ వీడితే లక్ష్మీనారాయణ ముందున్న ఒక ఆప్షన్ టీడీపీ.
జనసేనతో మింగిల్ అవ్వడం సులువే..
ఒకవేళ శత్రుత్వం కొద్దీ టీడీపీ వద్దనుకున్నా.. జనసేనతోనూ కన్నాకు మంచి బంధమే ఉంది. బీజేపీ-జనసేన పొత్తు నేపథ్యంలో చాలాసార్లు కన్నా, పవన్ కలిశారు. అనేక మేథోమథన కార్యక్రమాల్లో పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. పైగా.. సామాజికవర్గ సమీకరణపరంగా చూసినా జనసేనతో మింగిల్ అవ్వడం సులువే. మరి.. కన్నా మార్పు అనివార్యమని ప్రచారం ఎంతగా ఉందో, టీడీపీకా, జనసేనకా అనే ప్రశ్న కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఇక్కడ కన్నా లెక్క మాత్రం గుంటూరు 2 నియోజకవర్గంగా తెలుస్తోంది.
పోటీ మాత్రం ఈ నియోజకవర్గం నుంచే..
మొన్నటివరకూ పెదకూరపాడు నుంచి పోటీ చేసిన కన్నా.. ఈసారి అటు వెళ్లే ఆలోచనలో లేరు. గుంటూరు 2 నుంచి పోటీ అన్నది మాత్రం కన్‌ఫామ్. పేరు, పలుకుబడి, సామాజిక వర్గ సమీకరణపరంగా గుంటూరు 2ను బేస్ చేసుకుని కన్నాను టీడీపీ చేరదీస్తుందా..? లేదంటే జనసేనలో చేరినా అదే ఆఫర్ కంటిన్యూ అవుతుందా..? ప్రస్తుతానికి రెండుపార్టీలకూ సమదూరంలో ఉన్న ఇవాళ కాకపోతే రేపు ఓ క్లారిటీ ఇస్తారా..?
మరిన్ని ఏపీ వార్తల కోసం
