శ్రీనివాసుడంటేనే అలంకార ప్రియుడు. ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుండటంతో వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవిందనామస్మరణతలో ఆలయాలన్నీ మారుమోగుతున్నాయి. శ్రీవేంకటేశ్వరునికి అలంకరణ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో స్వామివారిని రోజుకో అలంకారంతో పూజిస్తారు భక్తులు. అయితే కాకినాడ జిల్లాలోని ఓ ఆలయంలో స్వామివారిని బంగారు ఆభరణాలతో, పట్టుపీతాంబరాలతో అలంకరించాల్సిందిపోయి… కమ్మని పులిహోరతో స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దారు. తిరునామంతో.. పసుపు వర్ణంలో పులిహోరలో ఒదిగిపోయిన స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చి దర్శించుకున్నారు.
జిల్లాలోని తునిమండలం ఎస్ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కమ్మటి పులిహారతో చేసిన స్వామి వారి స్వరూపం భక్తులును ఆకట్టుకుంటోంది. ఆలయ కమిటీ, అర్చకులు అంతా కలిసి 150 కేజీల పులిహార తో వెంకటేశ్వర స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందనామ స్మరణతో భక్తులు భక్తిశ్రద్ధలతో పులిహోరలో శ్రీవేంకటేశ్వరుని చూసి ఆథ్యాత్మిక ఆనందం పొందారు. మరోవైపు ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి