అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతల్లో ఒక దాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
కాగితం కృష్ణ అనే వ్యక్తి ఎప్పటిలాగానే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతలు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. క్లీన్ చేస్తున్న సమయంలో ఒక పీత విచిత్రంగా ఉండడాన్ని ఆయన గమనించారు. వెంటనే దాన్ని బయటకు తీసి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. పీతపై నరసింహస్వామి ముఖ గుర్తులు కన్పించటంతో చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు. ఇలాంటి పీతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ కృష్ణ చెప్తున్నారు.
విషయం ఆ నోట ఈ నోట గ్రామం మెుత్తం పాకడంతో దీన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫొటోలు తీసుకుని కుటుంబసభ్యులు, బంధువులకు పంపించుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. తమ గ్రామంలో జరిగిన వింత చూడాలంటూ పోస్టులు పెడుతున్నారు. పీతను చూసేందుకు వచ్చిన వారంతా ఇలాంటి దాన్ని తాము కూడా ఇంతవరకు చూడలేదంటూ చెప్పుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..