Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పీకలదాకా తాగి నాగుపాముతో పరాచకాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

తాగితే ఒక్కరు ఇద్దరవుతారు.. అడ్డు అదుపు అనేదే ఉండదు.. ఆసమయంలో మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది.. తాము ఏం చేస్తున్నామో? ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి మందు బాబులకు అర్ధంకాదు.. మందు మైకం దిగిన తర్వాత అర్ధమవుతుంది..

Viral Video: పీకలదాకా తాగి నాగుపాముతో పరాచకాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
Viral Video
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 6:13 PM

తాగితే ఒక్కరు ఇద్దరవుతారు.. అడ్డు అదుపు అనేదే ఉండదు.. ఆసమయంలో మందుబాబుల ధైర్యం ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మందు తాగితే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది.. తాము ఏం చేస్తున్నామో? ఎవరితో పెట్టుకుంటున్నామో అని కూడా ఒక్కోసారి మందు బాబులకు అర్ధంకాదు.. మందు మైకం దిగిన తర్వాత అర్ధమవుతుంది.. అచ్చం అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.. ఫుల్లుగా తాగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు.. అప్పుడే ఓ పాము మందుబాబు కంటపడింది. ఇంకేముంది గంటసేపు దానితో మందుబాబు ఆటలు ఆడుకున్నాడు.. చివరకు చూసి.. చూసి.. మందుబాబును ఒక్క కాటేసింది ఆ త్రాచుపాము..

సత్యసాయి జిల్లాలోని కదిరిలో మద్యం మత్తులో నడిరోడ్డుపై నాగరాజు అనే యువకుడు పాముతో హల్చల్ చేశాడు.. దాదాపు గంటసేపు కదిరి- అనంతపురం ప్రధాన రహదారిపై పాముతో నాగరాజు పరాచకాలు ఆడాడు… కాలితో తన్నుతూ… చేతితో కొడుతూ పామును నానారకాలుగా చిత్రహింసలు పెట్టాడు.. పామును మెడలో వేసుకుని రోడ్డుపై తిరుగుతున్న నాగరాజును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దాని మానాన అది చెట్ల పొదల్లోకి వెళుతున్నా… తాగిన మైకంలో నాగరాజు దాన్ని వదిలిపెట్టలేదు. పామును పట్టుకొచ్చి రోడ్డు మీద వేసి ఆటలాడుతున్నాడు.. చుట్టుపక్కల వారు ఎంత వారించినా.. మద్యం మత్తులో ఉన్న నాగరాజు వారి మాటలను పట్టించుకోకుండా పాముతో చెలగాటమాడాడు..

వీడియో చూడండి..

దాదాపు గంటసేపు పాము… మందుబాబు చెలగాటాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఎంత చెప్పినా పామును వదలలేదు.. చివరకు త్రాచుపాము మనోడి చేష్టలకు విసుగు చెందినట్లు ఉంది. తన ముందు ఆటలాడుతున్న నాగరాజును ఒక్క దెబ్బలో కాటేసింది. అంతే మనోడు అప్పుడు గాని పామును వదిలిపెట్టలేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగరాజు గతంలో అనేకసార్లు మద్యం మత్తులో ఇలాగే పాములను పట్టుకొని మెడలో వేసుకుని.. రోడ్డుపై తిరుగుతూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం… డబ్బులు ఇవ్వమని బెదిరించడం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.