East Godavari: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయా అనే విధంగా వైసీపీ నేతలు(YCP), జనసేన(Janasena) నేతల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. రోజురోజుకీ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పెరిగి పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ.. సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇన్ చార్జ్ గా పోస్ట్ తీసుకుంటానని చెప్పారు. అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ ను ఓడిస్తాని శబధం చేశారు చంద్రశేఖర్. అంతేకాదు జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారని… జనసేన కార్యకర్తలు బాధపడే రోజు త్వరలోనే వస్తుందని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే చంద్రశేఖర్.
మరి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు అన్ని జిల్లాల కంటే ఓట్లు అధికంగా వచ్చింది తూర్పుగోదవారి జిల్లాలోనే.. అంతేకాదు జనసేన తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మల్యే కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే కావడం విశేషం.
Also Read:
గాడిదలు లేకపోతే ఆ ఊర్లు చరిత్రలో ఉండవ్.. దావాఖానాకు అవే.. దాహానికి అవే.. ఎక్కడో తెలుసా!
Exams: పేపర్ కొరత కారణంగా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తీవ్రరూపం దాల్చుతోన్న ఆర్థిక సంక్షోభం..