రోడ్డుపై తన్నుకున్న వైసీపీ కార్యకర్తలు..!

|

May 27, 2020 | 3:56 PM

కడప జిల్లా వైసిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బి కోడూరు మండలంలో వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. అధికారపార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తన్నులాల దాకా వెళ్లింది. భూమి పూజ విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగారు. గ్రామ సచివాలయం భూమి పూజ కార్యక్రమానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తిని పిలవలేదంటూ.. మరో వర్గంపై ఘర్షణకు దిగారు. బద్వేల్ నియోజకవర్గం బి.కోడూరు మండలంలో కొంతకాలంగా మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, యోగానంద రెడ్డిల మధ్య […]

రోడ్డుపై తన్నుకున్న వైసీపీ కార్యకర్తలు..!
Follow us on

కడప జిల్లా వైసిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బి కోడూరు మండలంలో వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. అధికారపార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తన్నులాల దాకా వెళ్లింది. భూమి పూజ విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగారు. గ్రామ సచివాలయం భూమి పూజ కార్యక్రమానికి ఒక వర్గానికి చెందిన వ్యక్తిని పిలవలేదంటూ.. మరో వర్గంపై ఘర్షణకు దిగారు.
బద్వేల్ నియోజకవర్గం బి.కోడూరు మండలంలో కొంతకాలంగా మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, యోగానంద రెడ్డిల మధ్య మండల నాయకత్వం కోసం విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు పాయలకుంట గ్రామంలో సచివాలయ భూమి పూజ కార్యక్రమానికి కృష్ణారెడ్డికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన తరుపు వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.