Guntur Jinnah Tower: ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. దీంతోపాటు దానికి త్రివర్ణ రంగులు వేసి జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే కూల్చివేస్తామంటూ హెచ్చరించడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. జిన్నా టవర్‌కు త్రివర్ణ రంగులు వేసి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేయడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలో తాజాగా.. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తొలగించారన్న వార్తలు మళ్లీ కలకలం రేపాయి. జాతీయ జెండాను తొలగించారన్న నేపథ్యంలో క్రమంలో కార్పొరేషన్ (guntur municipal corporation )అధికారులు అప్రమత్తమై దీనిపై క్లారిటీ ఇచ్చారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను తొలగించలేదని.. ఎత్తుపెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంసీ కమిషనర్ నిషాంత్ కుమార్ స్పష్టంచేశారు. గతంలో 40 అడుగుల ఎత్తులో ఉన్న (National Flag) జెండాను 60 అడుగులకు పెంచుతున్నామని.. పాత దిమ్మె స్థానంలో కొత్తగా కాంక్రీట్ వేసి బెస్‌మెంట్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా విషయంపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని కమిషనర్ సూచించారు. దిమ్మె పనులు గురువారం మధ్యాహ్నానికి పూర్తవుతాయని.. వెంటనే కొత్త జెండాను ఏర్పాటు చేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు.
బుధవారం పనులను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. జిన్నా టవర్ గుంటూరుకే కాకుండా దేశానికే ఐకాన్ అని పేర్కొన్నారు. జెండా దిమ్మె బేస్మెంట్ పనుల కోసం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో పాత జెండా దిమ్మెను తొలగించి కొత్తది బలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే.. గత సోమవారం, మంగళవారం రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి నివాళిగా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల్లో జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను అవనతం చేశామని పేర్కొన్నారు. కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, అపొహలకు గురికావొద్దని సూచించారు.
Jinnah Tower, Guntur: The National Flag waving at 40 ft was removed to replace with a new flag pole of 60fts. In between the restoration work, the flag was removed as the pole had to be replaced. 1/3
Attached Press Note from Guntur Administration pic.twitter.com/L1t9K2wX26
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 23, 2022
Also Read: