Janasena: మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ముహూర్తం ఫిక్స్.. విజయవంతం చేయాలని జనసేనాని పిలుపు

|

Feb 04, 2023 | 7:53 AM

మూడో విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనుంది. జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.

Janasena: మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ముహూర్తం ఫిక్స్..  విజయవంతం చేయాలని జనసేనాని పిలుపు
‘‘రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు-పవన్‌ భేటీ అవశ్యం. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం జనసేన నిత్యం పని చేస్తోంది. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం. విశాఖలో భూదందాలపై కూడా జనసేన పోరాటం చేస్తోంది’’
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సమస్యలపై స్పందిస్తూ .. ప్రజలకు అండగా నిలబడుతూ.. ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడుతోంది. ఓ వైపు జనసేన నేతలు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జనవాణి – జనసేన భరోసా పేరుతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.  మరోవైపు పార్టీ  బలోపేతం చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. మూడో విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనుంది. జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడో విడత జనసేన క్రియా శీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

 

రేపటి తరాల భవిష్యత్తు కాంక్షించి, సమ సమాజ శ్రేయస్సుకు బాటలు సిద్ధాంతాల సాయంతో సామాన్యులు సైతం రాజకీయం చేసేలా యువత కలలు సాకారం అయ్యేలా జనసేనాని పూరించిన శంఖం జనసేన పార్టీ. సభ్యత్వం తీసుకొనే వారు నామ మాత్రంగా కొద్దిపాటి రుసుమును వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి రూ. 500 చెల్లిస్తే చాలు ఏడాది పాటు ధీమా గా ఉండొచ్చు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల భీమా కుటుంబ సభ్యులకు అందించి ఆదుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 50,000  ప్రమాద భీమాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా వైద్య సేవలు అందుకునే వెసులుబాటు తో పాటు ఆరోగ్య భీమా అందిస్తారు. నిరంతరం పార్టీ కొరకు శ్రమించే కార్యకర్తలకు 5 లక్షల భీమా సౌకర్యం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించారు.

ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకుంటే క్రియాశీలక సభ్యత్వంతో పాటు భీమా కొనసాగింపు ఉంటుంది. ఈ క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన కార్యక్రమాలు పర్యవేక్షణ కొరకు, తగిన సమాచారం అందించి, సత్వర సహాయం అందించేలా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక డెస్క్ ని ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తుంది ఈ ‘క్రియాశీలక సభ్యత్వం అని జనసేన పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..