Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కేంద్రమే చొరవ తీసుకోవాలి.. పోలవరంపై పవన్ కల్యాణ్

2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు.

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కేంద్రమే చొరవ తీసుకోవాలి.. పోలవరంపై పవన్ కల్యాణ్
Pawan Kalyan

Updated on: Apr 04, 2023 | 6:21 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని.. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్థక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ తింటోందని పవన్ షెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు.

2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. విశాఖ పారిశ్రామిక జోన్ కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్ కు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్. అండ్ ఆర్. విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు.

పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24 శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణంలో విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us