Pawan Kalyan: గాంధీ జయంతినాడు పవన్ కల్యాణ్ శ్రమదానం.. రెండు జిల్లాల్లో పాడైన రోడ్లకు మరమ్మతులు

|

Sep 27, 2021 | 4:33 PM

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయనున్నారు.

Pawan Kalyan: గాంధీ జయంతినాడు పవన్ కల్యాణ్ శ్రమదానం.. రెండు జిల్లాల్లో పాడైన రోడ్లకు మరమ్మతులు
Pawan kalyan
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయనున్నారు. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రమదానం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ శ్రమదానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు. అటు అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఓ రోడ్డుకు మరమ్మతు చేపట్టే కార్యక్రమాన్ని జనసేన చేపట్టనుంది.

రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను మరమ్మతు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం తెలిసిందే. నాలుగు వారాలు గడువునా ప్రభుత్వం ఇంకా ఎలాంటి మరమ్మతులు చేపట్టడకపోవడం పట్ల ఆ పార్టీ మండిపడింది.  పాడైన రోడ్లను సరిచేసే విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికీ పాడైన రహదారుల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతారని తెలిపారు.

Also Read..

CM KCR on Cyclone: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్

MAA Elections 2021: రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బండ్ల గణేశ్‌..