Pawan Kalyan: వైసీపీ నేతల్లో అధికార మదం పెరిగింది.. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తాః పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. అధికార వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల తూటాలు పేలుతునన్నాయి.

Pawan Kalyan: వైసీపీ నేతల్లో అధికార మదం పెరిగింది..  భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తాః పవన్ కళ్యాణ్
Pawan Kalyan

Updated on: Sep 29, 2021 | 4:56 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. అధికార వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల తూటాలు పేలుతునన్నాయి. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇంతకు ముందు లెక్క వేరు..ఇప్పటిలెక్క వేరు.! అన్నారు పవన్ కళ్యాణ్.. జనసైనికుల సింహ గర్జనలు. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని మండిపడ్డారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం పెరిగిందని ఆరోపించారు. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తానంటూ పవన్‌ హెచ్చరించారు. ఈ సన్నాసులకు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం.. నేను నేర్పిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తానన్నారు పవన్ కళ్యాణ్.

తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, ప్రజా సేవకు అన్ని వదలుకుని వచ్చానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్‌ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలకు చాలా గౌరవిస్తానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్‌ అండ్‌ వైట్‌ అని పేర్కొన్నారు. గుంటూరు బాపట్లలో పుట్టిన వాడిని తనకు బూతులు రావా..? అని ప్రశ్నించారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని పవన్‌కల్యాణ అన్నారు.

Read Also… Viral Video: జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు.. కానీ వారు ఊహించనిది జరిగింది.. ఇంతకీ ఏం జరిగింది?