Pawan Kalyan: జనసేన(Janasena) క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన రెండో దఫా ప్రారంభిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ సందర్భంగా దాదాపు లక్షమందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. వీరు జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని.. ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టి వచ్చిందని చెప్పారు జనసేనాని.
అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారు. ఇవన్ని చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందచేశాను. ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పెద్ద ఉద్యమంలా చేపట్టారు.
లక్ష మందికిపైగా సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు బీమా చెక్కులు అందించారు. మన కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టింది. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడింపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.
Also Read: